ETV Bharat / city

అమరావతి డెవలప్​మెంట్ పార్ట్​నర్స్​ లిక్విడేషన్​కు ఉత్తర్వులు జారీ - అమరావతి అంకుర ప్రాంతం వార్తలు

అమరావతి డెవలప్​మెంట్ పార్ట్​నర్స్ లిక్విడేషన్ ప్రక్రియకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. అంకుర ప్రాంతంలో తదుపరి పనులు జరగకుండా గత ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సిందిగా ఏఎంఆర్టీఏ, అమరావతి డెవలప్​మెంట్ కార్పొరేషన్​(ఏడీసీ)కు సూచించింది. అమరావతి డెవలప్​మెంట్ కార్పొరేషన్-సింగపూర్ కన్సార్షియమ్​తో కలిసి ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్​మెంట్ పార్ట్​నర్స్ లిమిటెడ్​ పరస్పర అంగీకారంతో లిక్విడెషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించింది.

Amaravati startup area
Amaravati startup area
author img

By

Published : Dec 3, 2020, 4:43 AM IST

రాజధానిలోని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ అమరావతి డెవలప్​మెంట్ పార్ట్​నర్స్ లిక్విడెషన్ ప్రక్రియకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ అంశానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంకుర ప్రాంతంలో తదుపరి పనులు జరగకుండా ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అప్పటి సీఆర్డీఏ ప్రస్తుత ఏఎంఆర్డీఏ కమిషనర్, అమరావతి డెవలప్​మెంట్​ కార్పొరేషన్​కు సూచించింది.

స్టార్టప్ ఏరియా డెవలప్​మెంట్ ప్రాజెక్టు కోసం చేసుకున్న రాయితీ, అభివృద్ధి ఒప్పందం, భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు ప్రస్తుత అమరావతి మెట్రో డెవలప్​మెంట్ అథారిటీ, అప్పటి సీఆర్డీఏ కమిషనర్​కు, ఏడీసీ సీఎండీకి అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అమరావతి డెవలప్​మెంట్ కార్పొరేషన్-సింగపూర్ కన్సార్షియమ్​తో కలిసి ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్​మెంట్ పార్ట్​నర్స్ లిమిటెడ్​ పరస్పర అంగీకారంతో లిక్విడెషన్ ప్రక్రియ చేపట్టాలని అందులో సూచించారు. 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులోని ఒప్పందాలపై ముందుకు వెళ్లకుండా లిక్విడెషన్ మూసివేత ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతి డెవలప్​మెంట్ పార్ట్​నర్స్ సంస్థలో ఏడీసీకి 7.90 కోట్ల రూపాయల నిధులు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : మూడోరోజు శాసనసభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.