ETV Bharat / city

పాదయాత్రకు అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్​.. రేపు విచారణకు వచ్చే అవకాశం - second phase padayatra

AMARAVATI FARMERS PETITION IN HIGH COURT: తమకు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు రెండోసారి పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

AMARAVATI FARMERS PETITION IN HC
AMARAVATI FARMERS PETITION IN HC
author img

By

Published : Sep 5, 2022, 4:55 PM IST

AMARAVATI FARMERS PETITION : సెప్టెంబర్​ 12న నిర్వహించే పాదయాత్రకు అనుమతి కోరుతూ హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి నుంచి అరసవెల్లికి వరకు పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్ర అనుమతి కోసం డీజీపీకి దరఖాస్తు చేసింది. రైతులు వేసిన పిటిషన్​పై రేపు విచారణ జరిగే అవకాశం.

ఇదీ సంగతి: 1000 రోజులు సమీపిస్తున్నా ప్రభుత్వంపై రాజధాని రైతుల పోరాటం ఆగడం లేదు. దేవుడు కరుణించినా పూజారి వరమియ్యనట్లుగా మారింది రైతులు, ఆ ప్రాంత ప్రజల పరిస్థితి. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా, ఎన్ని చీవాట్లు పెట్టినా మళ్లీ ఏదో ఒక రూపంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తోంది. కానీ రైతులు, రాజధాని ప్రజలు మాత్రం తమకు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం సెప్టెంబరు 12కి వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా మహా పాదయాత్ర చేపట్టనున్నారు. తుళ్లూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర-2 రూట్ మ్యాప్​ను ఐకాస నాయకులు విడుదల చేశారు. మొత్తం 60రోజులు పాదయాత్ర సాగనుందని తెలిపారు.

తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఐకాస నాయకులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతోందని వెల్లడించారు. ప్రతి ఎనిమిది రోజులకోసారి సెలవు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు యాత్ర సాగనుందని ఐకాస నాయకులు తెలిపారు. యాత్రను విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుమతి కోసం ఐకాస నేతలు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. యాత్ర సమయంలో ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్, బయోటాయ్​లెట్ల వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.