ETV Bharat / city

'ఎన్నికలు వాయిదా పడితే సీఎం స్పందించారు..మరీ మా సంగతేంటీ?'

author img

By

Published : Mar 18, 2020, 6:04 PM IST

రాజధాని రైతుల పోరు 92 వ రోజుకు చేరింది. ఇవాళ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాయపూడిలో వినూత్నరీతిలో ప్రదర్శన చేపట్టారు. తుళ్లూరులో మహిళలు రహదారిపై వడియాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

amaravati formers struggle to reach the 92nd day

92 వ రోజు అమరావతి రైతుల ఆందోళన

రాజధాని అమరావతి కోసం ఎన్ని రోజులైనా తమ ఉద్యమం కొనసాగిస్తామని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. తుళ్లూరులో 92వ రోజు మహాధర్నా సందర్భంగా మహిళలు రహదారి పైన వడియాలు పెట్టి తమ నిరసన తెలిపారు. తుళ్లూరు శిబిరంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు హోమియా మందులను పంచిపెట్టారు. ఓ వైపు మండే ఎండలతో ఉక్క పోస్తున్న.. ఇవి ఏవీ తమ పోరాటాన్ని ఆపవని మహిళలు తేల్చి చెబుతున్నారు.

రాయపూడిలో..

మూడు రాజధానాల ప్రతిపాదనను నిరసిస్తూ రాయపూడిలో రైతులు, మహిళలు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతల జీవితాలపై రాష్ట్ర ప్రభుత్వం సవారీ చేస్తోందని, బతుకు సవారీ అనే స్కిట్​ను ప్రదర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని.. రైతులు, రాష్ట్ర ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.