ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి(Amaravathi jac on 3 capitals withdraws) ఐకాస ప్రకటించింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస కోరింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఐకాస నేతలు.. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ఐకాస నేతలు.. ఏకైక రాజధానిగా అమరావతిని(ap 3 capitals withdraws) ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటన వచ్చిన తర్వాతే ప్రభుత్వాన్ని నమ్ముతామని రైతులు స్పష్టం చేశారు.
పోరు ఆగదు..
3 రాజధానుల బిల్లును సమగ్రంగా ప్రవేశపెడతామని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై.. మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు మండిపడ్డారు. ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరు ఆపబోమని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి..
AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ