Tenth Day Of Amaravati Padayatra : అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు కృష్ణా డెల్టాలో అపూర్వ స్వాగతం లభించింది. చల్లపల్లిలోని మహ్మాతగాంధీ విగ్రాహానికి నివాళులు ఆర్పించిన అనంతరం.. అమరావతి రైతులు 10వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. రైతుల యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. యాత్రకు సంఘీభావంగా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
పాఠశాల విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. భారీ జాతీయ జెండాతో రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. మహిళలు స్వామివారి రథానికి కొబ్బరికాయలు కొడుతూ హారతులు పట్టారు. రైతుల పాదయాత్రకు పారిశ్రామికవేత్తలు, మాజీ సైనికులు మద్దతు పలికారు. అమరావతి అభివృద్ధి చెందితే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు చేస్తున్న పోరాటం తప్పక ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: