ETV Bharat / city

Farmers Padayatra in Nellore: వర్షంలోనూ తగ్గని జోరు...27వ రోజు నెల్లూరులో కొనసాగుతున్న రైతుల పాదయాత్ర - రైతుల మహాపాదయాత్ర 26వ రోజు

చేతిలో జాతీయ జెండాలు, మెడలో ఆకుపచ్చ కండువాలు.. సంఘీభావం తెలుపుతున్న వివిధ వరాల ప్రజలు.! ఇలా .. అమరావతి రైతుల పాదయాత్రకు(Amravati Farmers Mahapadayatra) అడుగడుగునా జననీరాజనం అందుతోంది. నేడు 27వ రోజు నెల్లూరు పట్టణంలోని జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ 12కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.

Mahapadayatra
Mahapadayatra
author img

By

Published : Nov 27, 2021, 5:17 AM IST

Updated : Nov 27, 2021, 4:42 PM IST

రైతుల పాదయాత్రకు.. అడుగడుగునా జననీరాజనం

Farmers Padayatra in Nellore Today: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర 27వరోజుకు చేరింది. నెల్లూరులో జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద రాత్రి బసచేసిన రైతులు.. వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన తర్వాత ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు.

భారీ వర్షంలోనూ కొనసాగుతున్న యాత్ర...
నెల్లూరులో భారీ వర్షం కురుస్తోంది. వర్షంలోనూ రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. మహాపాదయాత్రకు వివిధ ప్రజాసంఘాలు మద్దతుగా వచ్చారు. నెల్లూరు బార్‌ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వీరితో పాటు నెల్లూరు నాయిబ్రాహ్మణుల సంఘం కాడా పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ ఇవాళ 12 కిలోమీటర్ల మేర నడవనున్నారు. జగన్‌ ఇచ్చే మంత్రి పదవులకు ఆశపడి.. తమను అవమానించొద్దని.. మహిళలు వైకాపా ఎమ్మెల్యేలకు సూచించారు.

రైతుల పాదయాత్రకు.. అడుగడుగునా జననీరాజనం

అడుగడుగున నీరాజనం..
26వ రోజు నెల్లూరు నగరంలోని శెట్టిగుంటరోడ్డు, వివర్స్‌కాలనీ, లక్ష్మీపురం, స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరుబస్టాండ్, పూలే విగ్రహం, విజయమహాల్‌గేటు, గాంధీబొమ్మ సెంటర్, వీఆర్‌సీ, హరినాథపురం మీదగా యాత్ర సాగింది. దారి పొడవునా వివిధ వర్గాలు, సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. నెల్లూరు చేనేత సమాఖ్య ప్రతినిధులు మహిళలతో కలిసి నడిచారు. నేతన్నలు పాదయాత్ర చేస్తున్న మహిళలకు చీరలు పెట్టారు. కోవూరు ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతాల మీదుగా వెళ్తున్న రైతులు..ఆ చీరల్ని అక్కడ నిరాశ్రయులకు పంచిపెట్టి మానవత్వం చాటారు.

రాజధాని రైతుల మహా పాదయాత్రకు నెల్లూరు పట్టణంలో తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి , జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ లు రైతుల తో అడుగు కలిపారు. మూడు రాజధానుల బిల్లుతో పాటు... ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రజలందరి మద్దతూ ఉందని.. అంతిమ విజయం వారిదేనని ధైర్యం నింపారు. నెల్లూరులో రాజధాని రైతులకు ట్రన్స్​జెండర్లు హారతులిచ్చి, పాదయాత్రకు మద్దతు తెలిపారు.

రైతుల పాదయాత్రకు.. అడుగడుగునా జననీరాజనం

అమరావతి రైతుల పాదయాత్ర చరిత్రాత్మకమైనది. అమరావతినిరాజధానిగా ప్రకటించిననప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. అలాంటి రాజధానిని మూడు ముక్కలు చేయాలనుకోవడం దారుణం. అమరావతిని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు.

-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా నేత

అమరావతి రైతుల మహా పాద యాత్ర భారీ వర్షాలను లెక్కచేయకుండా ముందుకు సాగుతోంది. అడుగడుగునా పూలు చల్లుతూ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉంది.

-దేవినేని ఉమ, తెదేపా నేత

సాధారణంగా ఒక పార్టీ అనుచరులు కదిలితే ప్రత్యర్థి పక్షాలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటారు. రైతుల పాదయాత్రలో అవేమీ కనిపించలేదు. వైకాపా మినహా అన్ని పార్టీల నేతలూ యాత్రలో స్వచ్ఛందంగాపాల్గొంటున్నారు విరాళాలు అందజేయడంలోనూ ఇదే ఉత్సాహం కనబర్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి... రైతులకు రెండు రోజులపాటు వసతి, ఆహారం అందజేయడంతో పాటు రూ.2లక్షల విరాళం అందజేశారు. అదే గ్రామానికి పెల్లకూరు శ్రీనివాసులరెడ్డి రూ.2లక్షల అందజేశారు. ఉదయగిరి సమీపంలోని కమ్మవారిపాళెం గ్రామస్థులు 32వేలు, నెల్లూరులో కె.పెంచలనాయుడు మిత్రమండలి రూ. 60వేలు, మాధవరావు మిత్ర బృందం రూ. 20వేలు విరాళం అందించింది. యాత్రకు(Amravati Farmers Maha Padayatra news) అనూహ్య ఆదరణ లభిస్తోందని ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Last Updated : Nov 27, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.