రైతుల దీక్షలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ సీఎం జగన్ సచివాలయానికి వస్తుండటంతో పోలీసులు పహారా పెంచారు. కొత్త శిబిరంలో రైతుల ఆందోళనకు అనుమతి నిరాకరించారు. మందడంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ప్రైవేటు స్థలంలో ఆందోళనకు అభ్యంతరమేంటని మహిళలు ప్రశ్నించారు. దీక్షా శిబిరాన్ని ఖాళీచేసేది లేదంటూ రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 'స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం కుట్ర'