వచ్చే వినాయకచవితిలోపు అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా ఉండేలా చూడాలంటూ రైతులు, మహిళలు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జై అమరావతి, జై గణేశా అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో.. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు విఘ్నేశ్వరుడిని ఊరేగించారు. తుళ్లూరు చెరువులో లంబోదరుడ్ని నిమజ్జనం చేశారు.
అమరావతికి తిరిగి రావయ్య అంటూ రైతులు ప్రార్థించారు. అనంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, నెక్కల్లు అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాల్లో 634వ రోజు నిరసన కొనసాగించారు.
ఇదీ చదవండి:
LETTER TO NHRC: ఎన్హెచ్ఆర్సీకి తెదేపా నాయకుల లేఖ..ఎందుకంటే..!