ఈ నెల 30వ తేదీకి అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకోనుంది. ఈ క్రమంలో ఈ నెల 30న భారీ బహిరంగ సభ నిర్వహించాలని జేఏసీ నేతలు భావించారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నందున 'అమరావతి ఉద్యమ భేరీ @ 500 డేస్ ' పేరుతో వెబినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వెబినార్ జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘ సంస్కర్తలు, మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఈ వెబినార్లో పాల్గొంటారని తెలిపారు.
వైకాపా ప్రభుత్వం 495 రోజులుగా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ తిరోగమనంలో పయనిస్తోందని అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిచేసి ఉంటే లక్షలాదిమంది యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విధ్వంసం తప్ప ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి కామధేనువులాంటి అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జెఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు