ETV Bharat / city

68వ రోజుకు అమరావతి నిరసనలు... నేడు దీక్షలో 151 మంది

author img

By

Published : Feb 23, 2020, 5:45 AM IST

Updated : Feb 23, 2020, 7:50 AM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ దీక్షలు చేస్తున్న రైతులు... దశలవారీగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. 24 గంటల నిరాహార దీక్షలను ఎక్కడికక్కడ చేపడుతున్న రైతులు, మహిళలు మరో అడుగు ముందుకు వేయనున్నారు. నేటి నుంచి 151 మంది ఎస్సీ, ఎస్టీ రైతులు, రైతుకూలీలు నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. నెలల తరబడి తాము పోరాటం చేస్తుంటే.. కనీసం ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

amaravathi protests reached to 68 day
68వ రోజుకు అమరావతి నిరసనలు

రాజధాని పోరుకు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. 'మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు' అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 68వ రోజుకు చేరాయి. వెలగపూడిలో శనివారం.. ఐదుగురు ఎస్సీ రైతులు 24 గంటల నిరాహార దీక్షకు కూర్చోగా.. ఇవాళ 151 మంది ఎస్సీ, ఎస్టీ రైతులు, రైతుకూలీలు... 24గంటల నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ప్రభుత్వం తమ సమస్య పరిష్కారించాలంటూ 151 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల కోసం వీరు..దీక్ష చేయనున్నారు. డ్రోన్ ద్వారా మహిళలు స్నానం చేసే దృశ్యాలు చిత్రీకరిస్తున్నారంటూ పోలీసులు పైనా మహిళా రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము స్నానాలు చేసే ప్రదేశంలో డ్రోన్లు తిప్పుతూ మనోవేదనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అమరావతి ప్రాంతంలో మహిళా ఐకాస నేతలు పర్యటించారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం భూములిస్తే.. వారి త్యాగాలను అవమానించడం తగదని మండిపడ్డారు. విశాఖలో భూదందా సాగించేందుకే సర్కారు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. ఈనెల 26న విజయవాడలో అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష చేపటనున్నట్లు మహిళా ఐకాస ప్రకటించింది.

ఆందోళనలు చేపట్టిన రైతులకు ప్రజాసంఘాలతో పాటు రాజకీయపార్టీలూ మద్దతు తెలిపాయి. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, దేవినేని ఉమమహేశ్వరరావు పర్యటించి సంఘీభావం తెలిపారు. రైతుల పోరాటాన్ని సర్కారు తేలికగా తీసుకుని.... కేసులతో భయందోళనకు గురి చేయాలని చూస్తోందని ఎంపీ గల్లా జయదేవ్​ ఆరోపించారు. నందిగామ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్న మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... జైలులో పెట్టాడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

రాజధాని గ్రామాల్లో చేపట్టిన బంద్ సహా రైతు ఆందోళనలకు సీపీఎం మద్దతు తెలిపింది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత వ్యాపారాలన్నీ... హైదరాబాద్​కు తరలిపోయాయని ఆ పార్టీ నేత మధు అన్నారు. ఇప్పటికైనా జగన్‌ మనసు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

రాయపూడి దీక్షా శిబిరం ఆధ్వర్యంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం యాత్ర చేపడుతున్నట్లు అమరావతి దళిత ఐకాస ప్రకటించింది.

68వ రోజుకు అమరావతి నిరసనలు

ఇదీ చదవండి : 'డ్రోన్ ద్వారా పరిశీలించడం కొత్తేం కాదు'

Last Updated : Feb 23, 2020, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.