రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అమరావతి ఐకాస నాయకులు అన్నారు. వారు ఈ విషయమై విజయవాడలో మాట్లాడారు. రైతులకు బేడీల ఘటనపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిథులు, అమరావతి పరిరక్షణ సభ్యులు అన్ని కుల, మత, వ్యాపార రంగాలకు చెందిన సభ్యులు అర్బన్ ఎమ్మార్వో జయశ్రీకి వినతి పత్రం అందజేశారు.
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారిపై చట్టాలను ఉపయోగించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐకాస నాయకులు శివారెడ్డి అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడటానికి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడమే రైతులు చేసిన నేరమా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ రైతులపై వారి రక్షణ కోసం తెచ్చిన చట్టాలను వారిపైనే ప్రయోగించి బేడీలు వేసి తీసుకెళ్లడం సిగ్గుచేటని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. వెంటనే అమరావతి రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: