అమరావతి పరిరక్షణ కోసం శనివారం గుంటూరులో మహా పాదయాత్ర చేపడుతున్నామని.. అమరావతి పరిరక్షణ నేత గద్దె తిరుపతిరావు చెప్పారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నిరసనలకు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు.
ఈ నెల 17తో రాజధాని రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తి కానుంది. ఏడాది సందర్భంగా అమరావతి రాజకీయేతర ఐకాస కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రేపట్నుంచి 6 రోజులపాటు వివిధ రూపాల్లో రైతులు నిరసనలు తెలపనున్నారు. రేపు మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనం నిర్వహణ, 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్ర, 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఐకాస నేతలు డిమాండ్ చేశారు.
ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. రాత్రి నుంచి ఒకే ఒక్క కేసు నమోదు