దేశ రాజధాని దిల్లీలో తమ గోడు వినిపించడానికి అమరావతి నుంచి అమరావతి ఐకాస సభ్యులు 15 మంది దిల్లీకి పయనమయ్యారు. దీర్ఘకాలంగా జరుగుతున్న అమరావతి ఉద్యమాన్ని హస్తిన పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళామని సభ్యులు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలపడానికి దిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం, అనేక ఇబ్బందులు కలిగించడంపై సవివరంగా వివరిస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే