రాజధాని అమరావతి నిర్మాణం కోసం తామంతా త్యాగాలు చేసి భూములు ఇస్తే.. ప్రభుత్వం తమ త్యాగాన్ని అపహాస్యం చేస్తుందని అమరావతి ఐకాస రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరావతి రైతులు పాల్గొన్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో నెలల తరబడి నిరసన దీక్ష చేపడుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని వాపోయారు.
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు ఏర్పాటు చేసే ప్రక్రియకు వైకాపా ప్రభుత్వం సన్నాహాలు చేయడం దారుణమన్నారు. కట్టడాలు నిర్మించిన అమరావతిని వదిలేసి అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామనడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ పోరాటానికి మద్దతు లభిస్తోందని.. జంగారెడ్డిగూడెంలోనూ తమకు మద్దతు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: