ETV Bharat / city

'మా గోడు ఎందుకు పట్టించుకోరు?'

న్యాయం చేయాలని కోరుతూ 6 నెలలుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతుల గోడును సినీ ప్రముఖులు ఎందుకు పట్టించుకోవడం లేదని అమరావతి రైతులు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో రైతులు, మహిళలు పలు వీడియోలను విడుదల చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో 175వ రోజూ నిరసనలు కొనసాగాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమరావతి గ్రామంలోని ధ్యాన బుద్ధ విగ్రహం ముందు మహిళలు నిరసన తెలిపారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన చోట ‘అమరావతి అసైన్డు రైతుల ఐకాస’ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. గ్రామాల్లో మహిళలు, రైతులు తమ ఇళ్ల ముందు అమరావతి జెండాలను చేతబూని కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.

amaravathi farmers questioning tollywood stars about capital city

author img

By

Published : Jun 10, 2020, 6:31 AM IST

దీక్షలు కనిపించడం లేదా?
సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన చిరంజీవి, నాగార్జున, సురేష్‌బాబు, రాజమౌళి, దిల్‌ రాజు, సి.కల్యాణ్‌ తదితర తెలుగు సినీ ప్రముఖులు ఉండవల్లి కరకట్టపై ఉన్న గోకరాజు గంగరాజు అతిథి గృహంలో బస చేశారు. ఈ విషయం తెలిసి 40 మందికి పైగా రాజధాని ప్రాంత మహిళలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఆందోళనలకూ అనుమతి లేదని వారికి పోలీసులు చెప్పారు. అమరావతి ఉద్యమానికి సినీ ప్రముఖుల మద్దతు, సంఘీభావం కోరేందుకు వెళ్తున్నామని రైతులు వివరించారు. అందుకు పోలీసులు నిరాకరించారు. అరగంట నిరసన తెలిపాక రైతులు వెనుదిరిగారు.

మద్దతు తెలిపేందుకు ఎందుకంత భయం: బీజేవైఎం
న్యాయం కోసం 6 నెలలుగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు భయపడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌నాయుడు ప్రశ్నించారు. ‘ఆర్థిక ప్రయోజనాలు, భూములను తప్ప సినీ పరిశ్రమ పెద్దలు ఎప్పుడైనా సామాజిక సమస్యల్ని పట్టించుకున్నారా? సీఎం జగన్‌తో సమావేశమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడని వారంతా అడగాల్సింది’ అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.