ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు 471వ రోజు ఆందోళనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, అబ్బరాజుపాలెం, పెదపరిమి, నెక్కల్లులో రైతులు నిరసన దీక్షలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వడానకి 14వ ఆర్థిక సంఘం అడ్డుచెప్పడం లేదా.. అని రైతులు కేంద్రాన్ని ప్రశ్నించారు. పుదుచ్చేరికో న్యాయం ఏపీకి మరో న్యాయమా అని నిలదీశారు. ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు.. పెదపరిమి, నెక్కల్లు, అనంతరవరం, దొండపాడు శిబిరాలకు పది వేల విరాళం అందించారు. ఏడు గ్రామాల్లోని శిబిరాల రైతులకు యూత్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ప్రతినిధులు ఔషధాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ స్టీల్ ప్లాంట్: గత ఆర్థిక ఏడాదిలో రూ.18 వేల కోట్ల అమ్మకాలు