మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక తమను మోసం చేశారని రాజధాని రైతులు ఆరోపించారు. పరిపాలన రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ రైతులు 371వ రోజు ఆందోళన చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, ఎర్రబాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం చర్చలకు ఆహ్వానించందని.. తాము ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్నా కనీసం ఒక్కసారైనా మా ఇబ్బందులపై సీఎం చర్చించలేదనివారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: