మందడంలో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. తమపై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ రోడ్లపై భారీగా చేరుకున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా ధర్నా చేస్తున్న రైతులను చిత్రీకరించారు. మధ్యాహ్నం మళ్లీ.. డ్రోన్లతో చిత్రీకరిస్తుండటంతో రైతులు లాక్కున్నారు. డ్రోన్లు ఇవ్వాలంటూ రైతులను పోలీసు కానిస్టేబుళ్లు కోరారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మందడం వద్ద మోహరించారు. ఐకాస నాయకులు కలుగజేసుకుని నచ్చజెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది.
మందడంలో ఉద్రిక్తత.. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం - రాజధాని రైతుల ఆందోళనలు న్యూస్
మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నాకు దిగారు. ధర్నా సమయంలో కొన్ని బస్సులు, సచివాలయ ఉద్యోగుల కార్లు, పోలీసు వాహనాలు నిలిచిపోయాయి.
మందడంలో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. తమపై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ రోడ్లపై భారీగా చేరుకున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా ధర్నా చేస్తున్న రైతులను చిత్రీకరించారు. మధ్యాహ్నం మళ్లీ.. డ్రోన్లతో చిత్రీకరిస్తుండటంతో రైతులు లాక్కున్నారు. డ్రోన్లు ఇవ్వాలంటూ రైతులను పోలీసు కానిస్టేబుళ్లు కోరారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మందడం వద్ద మోహరించారు. ఐకాస నాయకులు కలుగజేసుకుని నచ్చజెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది.
ఇదీ చదవండి: కేసులు వెనక్కి తీసుకోకపోతే.. ఇక్కడే ప్రాణాలు విడుస్తాం !