వైకాపా నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వారికి అనుకూలంగా పని చేస్తున్నారని అమరావతి రైతులు (అసైన్డు) విమర్శించారు. షెడ్యూల్డు కులాలకు చెందిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అమరావతిలో 361వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు.
పోలీసుల తీరును నిరసిస్తూ మందడం, ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరాల్లో రైతులు ప్లకార్డులతో ఆందోళన చేశారు. తమపై నమోదైన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ తుళ్లూరులో మహిళలు గీతా పారాయణం చేశారు. దొండపాడు, అనంతవరం,. పెనుమాక ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి: