అమరావతిలో ఆందోళనలు 70వ రోజుకు చేరుకున్నాయి. మందడంలో రైతులు, మహిళలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లే మార్గంలో దీక్షాశిబిరం ఉండకూడదంటూ పోలీసులు బలవంతంగా తమ శిబిరాన్ని ఖాళీ చేయించారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు తమ నిరసన తెలిసేలా ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇవీ చదవండి: ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ