అమరావతిలో రైతులు, మహిళలు ఆందోళన ఉద్ధృతం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ మార్గంలో వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ గోడు వినిపించేలా 'జై అమరావతి' అంటూ నినదించారు. పెద్దఎత్తున నినాదాలతో మందడం శిబిరం దద్దరిల్లింది.
నిరసనకారులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు నిలువరించారు. రైతులు, మహిళలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రైతులు రెండు చేతులు పైకెత్తి దండాలు పెట్టారు.
ఇదీ చదవండి: