ETV Bharat / city

రాజధాని రణం.. 46వ రోజు.. - అమరావతి ఉద్యమం

అమరావతి రైతుల దీక్ష 46వ రోజుకు చేరింది. పరిపాలన వికేంద్రీకరణకు నిరసనగా  రాజధాని రైతులు, ధర్నాలు నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి రైతులను చర్చలకు పిలవాలని కోరారు. అమరావతి రైతుల ఆందోళనకు  మద్దతుగా  వివిధ ప్రాంతాల్లోనూ  నిరసనలు కొనసాగాయి.

రాజధాని రణం.. 46వ రోజు..
రాజధాని రణం.. 46వ రోజు..
author img

By

Published : Feb 1, 2020, 5:36 AM IST

Updated : Feb 1, 2020, 5:49 AM IST

రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమిలో మహిళలు ధర్నా చేశారు. మందడంలోనూ రైతుల పోరాటం కొనసాగింది. రాజధాని వ్యవహారంలో కమిటీల పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం... ఇప్పుడు శాసనమండలిని రద్దు చేసి మొండిగా వ్యవహరిస్తోందని రైతులు ఆరోపించారు. తాడికొండ అడ్డరోడ్డులో రైతులకు మద్దతుగా ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, తెనాలి శ్రవణ్‌కుమార్‌లు ధర్నాలో పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంతవరకూ నిరసనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు.

అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలోని వారధి నుంచి బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని తెలుగుదేశం నేత గద్దె అనురాధ అన్నారు. సీఎం మొండి వైఖరితో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. అమరావతినే రాజధానిగా సాధించేంత వరకూ రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.

కృష్ణా జిల్లా నందిగామలో రైతులకు మద్దతుగా 22 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షను తెలుగుదేశం నేత దేవినేని ఉమ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతపురం జిల్లా కదిరిలో ఐకాస సభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయలాకు వెళ్లి ఉద్యోగులకు గులాబీలు అందిస్తూ... అమరావతి రైతులకు మద్దతు తెలపాలని కోరారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని...తరలించాల్సి వస్తే శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం... కర్నూలులో పెట్టాలని తెలుగుదేశం నేత భూమా అఖిలప్రియా డిమాండ్‌ చేశారు.

అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు పరిరక్షణ సమితి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 7న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనుంది. కాళేశ్వరం మార్కెట్ నుంచి మిల్క్ ఫ్యాక్టరీ వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. రైతులకు మద్దతుగా చెన్నైలోని వళ్లువర్‌ కోటం వద్ద వివిధ తెలుగుసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన తెలుగువారు... రాజకీయాలకు అతీతంగా ధర్నాలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: మా భూముల్ని లాక్కోవద్దు: ప్రభుత్వానికి ప్రజల వేడుకోలు

Last Updated : Feb 1, 2020, 5:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.