పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 52వ రోజుకు చేరుకుంది. మహిళా రైతులు కృష్ణా నదిలో జలదీక్ష చేశారు. పసుపు-కుంకుమలు వేసి కృష్ణమ్మను పూజించారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలని కోరారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం విశాఖ ప్రజలను మోసం చేస్తోందని.. విశాఖలో జరుగుతున్న భూసేకరణకు రైతులు భూములివ్వద్దని.. ఇస్తే తమలాగే మోసపోతారని అభ్యర్థించారు.
ఇవీ చదవండి.. 'రాజధాని అమరావతిలోనే ఉండేలా చూడండి'