ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 295వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి, తుళ్లూరు, మందడం, ఐనవోలు, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, పెదపరిమి, లింగాయపాలెం గ్రామాల్లో రైతులు ఆందోళన కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ.. ఎర్రబాలెంలో మహిళలు శ్రీరాముడికి పూజలు చేశారు. మందడంలో మహిళలు భగవద్గీత శ్లోకాలు చదువుతూ నిరసనను తెలియజేశారు. కృష్ణాయపాలెంలో మహిళలు హిందీ, ఆంగ్లం, తెలుగులో కాగితాలపై అమరావతిని రక్షించాలంటూ వినూత్న నిరసన చేపట్టారు. అమరావతిపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఐనవోలులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన వారికి గుణపాఠం చెబుతామని రైతులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: