గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు వేయడంపై రాజధాని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అనంతవరంలో రైతులు, మహిళలు చేతులు కట్టుకుని నిరసన తెలిపారు. మోకాళ్లపై కూర్చుని నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెదపరిమి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో అమరావతి రైతులు 316వ రోజు దీక్షను కొనసాగించారు.
ఇదీ చదవండి: