రాజధాని ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కవాతు నిర్వహించి మైక్‌లో సూచనలు చేశారు. వెలగపూడిలో టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎండలోనే కూర్చుని దీక్ష కొనసాగిస్తున్నారు. టెంట్ వేసేందుకు అనుమతించకపోవడంతో తుళ్లూరు గ్రామంలోని రైతులు ఓ ప్రైవేటు స్థలంలో దీక్ష చేస్తున్నారు. రైతులు కూర్చున్న ప్రైవేటు స్థలం వద్దకు పోలీసులు రావడంతో వారు గేటుకు తాళం వేశారు. దీంతో రైతులు కూర్చున్న ప్రైవేటు స్థలంపై పోలీసులు డ్రోన్ సాయంతో వివరాలు తెలుసుకుంటున్నారు.
అమరావతిలో భారీగా పోలీసుల మోహరింపు.. డ్రోన్‌తో గస్తీ - అమరావతిలో.. డ్రోన్‌తో పోలీసుల గస్తీ
రాజధాని ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. తుళ్లూరు గ్రామంలోని రైతులు ఓ ప్రైవేటు స్థలంలో దీక్ష చేస్తున్నారు. రైతులు కూర్చున్న ప్రైవేట్ స్థలం వద్దకు పోలీసులు రావడంతో వారు గేటుకు తాళం వేశారు. దీంతో రైతులు కూర్చున్న ప్రైవేట్ స్థలంపై పోలీసులు డ్రోన్ సాయంతో దృశ్యాలు సేకరిస్తున్నారు.