AMARAVATHI: అమరావతి ఉద్యమం ప్రారంభించి 900 రోజులు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నట్లు రాజధాని ఐకాస కన్వీనర్ సుధాకర్ చెప్పారు. రాజధానికి చెందిన 15 మంది రైతులు అసెంబ్లీని ముట్టడించిన కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. తమను కేసుల పేరుతో ఇంకా న్యాయస్థానాల చుట్టు ప్రభుత్వం తిప్పుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు. 900వ రోజుని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆందోళనలు చేపడుతున్నామని సుధాకర్ తెలిపారు.
ఇవీ చదవండి:
- ACCIDENT: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం.. ఇద్దరు మృతి..!
- పోలీసుల వలయంలో అమలాపురం.. జిల్లా పేరుమార్పు నేపథ్యంలో ముందస్తు చర్యలు
- ఒంగోలు పోలీసు మైదానంలో అబ్బురపరిచిన కమాండోల విన్యాసాలు