రాజధాని అమరావతి రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కలిశారు. అమరావతి విషయంలో జగన్ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇస్తే.. తమను బజారున పడేశారని విమర్శించారు. న్యాయం చేయాలని అడిగితే.. అక్రమంగా కేసులు పెడుతున్నారని... దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని పవన్‌కు వివరించారు.
కాయకష్టం చేసే కర్షకులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. ఇప్పుడు సీఐడీ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని అని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
PAWAN KALYAN: సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే ప్రధాన లక్ష్యం: పవన్