ETV Bharat / city

Awareness conference: అవగాహనతోనే ఆరోగ్యం

Awareness conference: మార్కులు, ర్యాంకులే ప్రామాణికంగా మారిన పోటీ ప్రపంచంలో యువతులు మానసిక ఒత్తిడితో పాటు రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అక్కినేని ఉమెన్స్‌ హాస్పటల్‌ ఛైర్మన్, డాక్టర్‌ మణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... జంక్‌ ఫుడ్ కారణంగా యువతులకు కలిగే నష్టాల్ని వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పించారు.

Awareness conference
అవగాహన కార్యక్రమం
author img

By

Published : Sep 20, 2022, 9:03 AM IST

Updated : Sep 20, 2022, 10:40 AM IST

Awareness conference: అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక యువతులు... ఇంటి ఆహారం తీసుకోవటం ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చునని అక్కినేని ఉమెన్స్ హాస్పటల్ ఛైర్మన్, డాక్టర్‌ మణి తెలిపారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో అతివల ఆరోగ్య సమస్యలపై ఈటీవీ భారత్​- ఈనాడు, అక్కినేని ఉమెన్స్ హాస్పటల్ సంయుక్తంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దుకాణాల్లో దొరికే ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు చుట్టుముడుతున్నాయని, సరైన ప్రణాళికతో ఇంటి ఆహారం తీసుకుంటే జబ్బులు దరిచేరవని వైద్యురాలు మణి సూచించారు. రాష్ట్రంలో 52 శాతం మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయని... డాక్టర్‌ మధుబిందు తెలిపారు. తప్పనిసరిగా ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, మాంసాహారం తీసుకోవాలన్నారు.

ఈతరం అమ్మాయిల్లో ఎక్కువ మంది అధిక రక్తస్రావం, అధిక బరువు, అవాంఛిత రోమాలు వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని... డాక్టర్‌ పద్మశ్రీ పేర్కొన్నారు. రుతుక్రమంలో వచ్చే సమస్యలపై చాలా మంది యువతులు గుర్తించలేకపోతున్నారని వైద్యురాలు పార్వతీ తెలిపారు. నెలసరికి సంబంధించిన అంశాలపై యువతులకు కచ్చితంగా అవగాహన అవసరమని సూచించారు.

అవగాహన కార్యక్రమం

"ఈతరం అమ్మాయిల్లో ఎక్కువ మంది అధిక రక్తస్రావం, అధిక బరువు, అవాంఛిత రోమాలు వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. రుతుక్రమంలో వచ్చే సమస్యలపై చాలా మంది యువతులు గుర్తించలేకపోతున్నారు. నెలసరికి సంబంధించిన అంశాలపై యువతులకు కచ్చితంగా అవగాహన అవసరం" -డాక్టర్‌ పద్మశ్రీ

అక్కినేని ఉమెన్స్ హాస్పటల్, ఈనాడు-ఈటీవీ భారత్​ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆరోగ్యానికి సంబంధించిన కీలకాంశాలు తెలుసుకున్నామని విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో చర్చించించేందుకు సంకోచించే విషయాలపై వైద్యులు చక్కని వివరణ ఇచ్చారని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 20, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.