ETV Bharat / city

Air India: ఇకపై హైదరాబాద్ నుంచి లండన్​కు నేరుగా విమానాలు - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి లండన్​కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి ఫ్లైట్ నేడు హైదరాబాద్ చేరుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.

flight
Air India
author img

By

Published : Sep 9, 2021, 4:12 AM IST

లండన్‌కు రాకపోకలు సాగించే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఇకపై తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి విమానం నేడు హైదరాబాద్ చేరుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి రేపు హైదరాబాద్ నుంచి లండన్ నాన్‌స్టాప్ విమానం టేకాఫ్ కానుందని వెల్లడించింది.

ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, అమృత్‌సర్ నగరాల నుంచే లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉండగా.. ఇకపై హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరనుంది. బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 256 సీట్లతో వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఇందులో 18 బిజినెస్‌ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయంది. భారత్-యూకే సెక్టార్ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిరిండియా అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:

వినాయక చవితికి సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.