ETV Bharat / city

ఇంజినీరింగ్‌లో ఫీజుల అలజడి.. ఏఐసీటీఈ సిఫార్సులపై సర్కార్​ తర్జనభర్జన - AICTE on Minimum Fees in Engineering

AICTE on Engineering Fee: ఇంజినీరింగ్‌లో కనీస ఫీజు విషయంలో ఏఐసీటీఈ సిఫార్సులపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాష్ట్రంలో బీటెక్‌ కోర్సుకు గరిష్ఠంగా ఉన్న ఫీజు కంటే ఏఐసీటీఈ కనీస రుసుములు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఉన్నత విద్యాశాఖ యోచిస్తోంది. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఏఐసీటీఈ సిఫార్సులను అములు చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

ఇంజినీరింగ్‌లో ఫీజుల అలజడి
AICTE on Minimum Fees in Engineering
author img

By

Published : May 23, 2022, 5:13 AM IST

ఇంజినీరింగ్‌లో కనీస ఫీజు విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సిఫార్సులపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. విద్యాదీవెన కింద ప్రభుత్వం బోధన రుసుములను పూర్తిగా చెల్లిస్తోంది. భారం తగ్గించుకునేందుకు నాలుగేళ్లకు ఒకే ఫీజును నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు సవరించాల్సి ఉండగా.. మొదటి ఒక ఏడాదికి ఇచ్చిన వాటినే మరో మూడేళ్లకు పొడిగించారు. వీటి సమయం 2022-23తో ముగుస్తుంది. 2023-24 నుంచి మళ్లీ సవరించాల్సి ఉంది. రాష్ట్రంలో బీటెక్‌ కోర్సుకు గరిష్ఠంగా ఉన్న ఫీజు కంటే ఏఐసీటీఈ కనీస రుసుములు అధికంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఉన్నత విద్యాశాఖ యోచిస్తోంది.

ఏఐసీటీఈ ఫీజులను అమలు చేస్తే ప్రభుత్వంపై భారీగా భారం పడుతుంది. వాటిపై లేఖ రాయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఏఐసీటీఈ సూచించిన కనీస ఫీజు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. బోధన రుసుముల చెల్లింపు పథకం అనేది ప్రభుత్వ విధానమని, దీంతో సంబంధం లేకుండా ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ఖరారు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అధ్యాపకులకు యూజీపీ పే స్కేల్స్‌ ఇవ్వాలన్నా, నాణ్యమైన విద్య అందించాలన్నా కనీస ఫీజు రూ.75,000 పైనే ఉండాలని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస ఫీజు రూ.35,000 ఉండగా.. గరిష్ఠంగా రూ. 70,000 ఉంది.

గత కొన్నేళ్లుగా డిమాండ్‌.. : రాష్ట్రం నిర్ణయిస్తున్న ఫీజులు అసమంజసంగా ఉంటున్నాయని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాశాలల ఆదాయ, వ్యయాల ఆడిట్‌ నివేదిక ఆధారంగా వీటిని నిర్ణయిస్తున్నారు. వ్యయాల్లో అప్పులపై వడ్డీలు, బోధనేతర సిబ్బంది జీతాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. తెదేపా హయాంలో కనీస రుసుములు రూ.35,000.. గరిష్ఠంగా రూ.1.16 లక్షలుగా ఉండేవి. ఎంసెట్‌లో 10,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి పూర్తిగా బోధన రుసుము చెల్లించేవారు. మిగతా వారికి రూ.35,000 చొప్పున ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా బోధన రుసుముల చెల్లింపులు అమలు చేసేందుకు ఫీజులను తగ్గించింది. కనీస ఫీజును రూ. 35,000గానే ఉంచి, గరిష్ఠ రుసుమును రూ.70,000కు పరిమితం చేసింది.

ఇప్పటికే మూడేళ్లుగా ఈ ఫీజులను అమలు చేయగా.. మరో ఏడాది ఇవే ఉండనున్నాయి. కళాశాలల నిర్వహణ వ్యయం పెరుగుతుండగా ఫీజులు తగ్గించడమేంటని? యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. నాణ్యతలేని కళాశాలలపై చర్యలు తీసుకుంటూనే.. బాగున్న కళాశాలలకు ఎక్కువ ఫీజులు ఉండాలని కోరుతున్నాయి. ఏఐసీటీఈ సైతం సాంకేతిక విద్యలో నాణ్యత తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కనీస రుసుమును తీసుకొచ్చింది. ఫీజుల నిర్ణయానికి నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులపై మొదట రాష్ట్రాల నుంచి ఏఐసీటీఈ అభిప్రాయాలను తీసుకుంది. ఆ తర్వాత కొన్ని మార్పులు చేసిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది.

చాలా చోట్ల రూ.35,000 మాత్రమే: రాష్ట్రంలో 281 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా వాటిలో 118 కళాశాలలకు రూ. 35,000 ఫీజు మాత్రమే ఉంది. గరిష్ఠ బోధన రుసుములు రూ.70,000 ఉన్నవి పది మాత్రమే. విద్యా దీవెన కింద ప్రభుత్వం ప్రస్తుతం త్రైమాసికానికి రూ.709 కోట్లు చెల్లిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.2,836 కోట్లు అవుతుంది. ఇందులో సాధారణ డిగ్రీ, ప్రభుత్వ పీజీ కళాశాలల ఫీజులను మినహాయిస్తే ఒక్క ఇంజినీరింగ్‌కే రూ. 1500 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఏఐసీటీఈ సిఫార్సు ప్రకారం కనీసం రూ. 79,600, గరిష్ఠం రూ. 1,89,600 చొప్పున చెల్లిస్తే ఒక్క ఇంజినీరింగ్‌కే దాదాపు రూ. 3,000 కోట్లకు పైగా కేటాయించాల్సి వస్తుందని అంచనా. ప్రైవేటులో పీజీ విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు లేనందున పెరిగే రుసుములను విద్యార్థులే భరించాల్సి ఉంటుంది.

.

ఏఐసీటీఈ సిఫార్సు చేసిన ఫీజులను చెల్లించాలి. నాణ్యమైన విద్య, అధ్యాపకులకు యూజీసీ పేస్కేల్స్‌ ఇవ్వాలంటే కనీసం రూ.79,000 ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ఫీజును ఖరారు చేశారు. బోధన రుసుముల చెల్లింపు పథకంతో సంబంధం లేకుండా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించాలి. - గంగిరెడ్డి, అధ్యక్షుడు, ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.