ETV Bharat / city

ఇంజినీరింగ్ సీట్లలో కోత.. ఏఐసీటీఈ నిర్ణయం

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 1,179 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కోత విధించింది. ప్రైవేటు కళాశాలల్లో గతేడాది 1,40,763 సీట్లు ఉండగా.. ఈసారి 1,791 సీట్లు తగ్గాయి. గతేడాది మూడు డీమ్డ్‌ కళాశాలలకు 7,800 సీట్లకు అనుమతి ఇవ్వగా.. ఈసారి 7,210కి పరిమితం చేసింది.

aicte cutting engineering seets in andhrapradesh
ఇంజినీరింగ్ సీట్లలో కోత
author img

By

Published : Jul 5, 2020, 8:08 AM IST

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 1,179 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కోత విధించింది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల అనుమతి జాబితాను ఏఐసీటీఈ జారీ చేసింది. గతేడాది 284 కళాశాలలు ఉండగా.. ఈసారి 274 కళాశాలలకు మాత్రమే అనుమతి లభించింది. అంటే 10 కళాశాలలు మూతపడ్డాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1,44,433 బీటెక్‌ సీట్లు ఉండగా.. ఈసారి 1,43,254 ఉన్నాయి.

ప్రభుత్వ కళాశాలల్లో స్వల్పంగా సీట్లు పెరగ్గా.. ప్రైవేటులో తగ్గాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం గతేడాది ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభించగా మూడు బ్రాంచిలకు 180 సీట్లను ఏఐసీటీఈ కేటాయించింది. 2019-20 సంవత్సరానికి శ్రీకాళహస్తీశ్వర కళాశాల ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేయలేదు. ఈసారి 360 సీట్లకు ఆమోదం పొందింది. ఈ క్రమంలో సాంకేతికంగా రెండు కళాశాలలు పెరిగాయి. గతేడాది 12 కళాశాలల్లో 3,670 సీట్లు ఉండగా.. ఈసారి 14 కళాశాలల్లో 4,282కు పెరిగాయి. ప్రైవేటు కళాశాలల్లో గతేడాది 1,40,763 సీట్లు ఉండగా.. ఈసారి 1,791 సీట్లు తగ్గాయి. గతేడాది మూడు డీమ్డ్‌ కళాశాలలకు 7,800 సీట్లకు అనుమతి ఇవ్వగా.. ఈసారి 7,210కి పరిమితం చేసింది.

ఇదీ చదవండి:

తుళ్లూరు నుంచి షికాగో వరకూ జై అమరావతి నినాదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.