ETV Bharat / city

అగ్రిగోల్డ్‌ కేసు: డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి - తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ తాజా వార్తలు

అగ్రిగోల్డ్‌ కేసు విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. 20 వేల రూపాయలు లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిచ్చింది. కరోనా పరిస్థితుల కారణంగా అధికారులే గ్రామాలకు వెళ్లి బాధితులను గుర్తించి కలెక్టర్ కార్యాలయాల ద్వారా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. అంగీకరించిన హైకోర్టు మార్చి31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Agrigold case
Agrigold case
author img

By

Published : Nov 9, 2020, 2:58 PM IST

Updated : Nov 9, 2020, 6:42 PM IST

తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. సుమారు 8 లక్షల మంది బాధితుల కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించింది. మానవత దృక్పథంతో బాధితులకు సొమ్ము చెల్లించేందుకు అనుమతినిచ్చి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరుతోంది. ఇవాళ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ ధర్మాసనం అగ్రిగోల్డ్ సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టింది. చిన్న డిపాజిటర్లకు సొమ్ము చెల్లింపుపై అభ్యంతరాలున్నాయా అని ధర్మాసనం ప్రశ్నించగా.. తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గతంలో పది వేల రూపాయలలోపు డిపాజిటర్లకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా డబ్బులు పంపిణీ చేశామని.. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు.

కమిటీ ద్వారా పరిశీలన

వార్డు సచివాలయాల సహకారంతో సీఐడీ ఇన్ స్పెక్టర్ గ్రామాలు లేదా మండలాలకు వెళ్లి బాధితులను గుర్తించి క్లెయిమ్ పత్రాలను సేకరిస్తారని పేర్కొన్నారు. క్లెయిమ్ పత్రాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవోలతో కూడిన కమిటీ పరిశీలిస్తుందన్నారు. వారు పంపిన క్లెయిమ్​లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్, సీఐడీ ఎస్పీతో కూడిన కమిటీ వాటిని పరిశీలించి ధ్రువీకరిస్తారని ఏజీ వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి డిసెంబరు 31 వరకు డబ్బులు బదిలీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తెలంగాణ హైకోర్టు.. మార్చి 31 వరకు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.

కేసు బదిలీపై విచారణ

అగ్రిగోల్డ్ కేసులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ... గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరాం కోరారు. అయితే బదిలీ చేసేందుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిపాలన పరమైన అధికారం ఉంటుందని.. దానిపై జ్యుడీషియల్ ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ హైకోర్టు సీజేని కోరాలని సూచించగా.. రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ఏజీ కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ తమకు చెల్లించాల్సిన రుణం వసూలు కోసం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్​లో కొన్ని ఆస్తులు వేలం వేశామని... వాటిని ఆమోదించి అనుమతివ్వాలని ఆంధ్రాబ్యాంకు ఎస్​బీఐ కోరాయి. వేలంలో సొమ్ము చెల్లించినప్పటికీ.. భూములు అప్పగించలేదని కొనుగోలుదారుల తరఫు న్యాయవాది కోరారు. అగ్రిగోల్డ్ సంబంధించి అనేక పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని క్రమపద్ధతిలో విచారణ జరిపి తేలుస్తామని హైకోర్టు తెలిపింది. అయితే సింగిల్ బిడ్డర్లకు బ్యాంకులు ఆస్తులను తక్కువ ధరకు అమ్ముతున్నాయని.. ఆ సొమ్ము బాధితులకు రాదని.. బ్యాంకుల వద్దే ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫు న్యాయవాది శ్రావణ్ పేర్కొన్నారు. అయితే బ్యాంకుల సొమ్ము కూడా ప్రజలదేనని.. డబ్బులు కావాలా వివాదం కావాలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంకులు, వేలానికి సంబంధించిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

ఇదీ చదవండి:

ఆదోనిలో సింపుల్​గా పెళ్లి... విందు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Last Updated : Nov 9, 2020, 6:42 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.