ETV Bharat / city

'మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రైతులకు సూచన‌లు ఇవ్వండి'

అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం 1953 నుంచి.. కొబ్బ‌రి ఉత్పత్తిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డంపై మంత్రి కన్నబాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కొబ్బరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో మంత్రి పాల్గొన్నారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రైతులకు సూచన‌లు అందించా‌ల‌ని పరిశోధన కేంద్రం వారిని కన్నబాబు కోరారు.

Agriculture Minister Review on Coconut Farmers in
కన్నబాబు
author img

By

Published : Sep 18, 2020, 4:00 PM IST

అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. 2020-2021 ఈ ఏడాదిని కొబ్బరి నామ‌ సంవత్సరంగా ప్రకటించ‌డం.. కొబ్బ‌రి రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న బాధ్య‌త‌ను మ‌రింత‌గా పెంచింద‌న్నారు. కొబ్బరి రైతుల‌కు ఆదాయం పెంచి ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం మ‌రింత నాణ్య‌మైన ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పాల‌ని మంత్రి కన్నబాబు సూచించారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సూచన‌లు అందించా‌ల‌ని కోరారు. రైతు భ‌రోసా కేంద్రాల వ‌ద్ద ఉన్న వ్య‌వ‌సాయ స‌హా‌య‌కుల ద్వారా కొబ్బ‌రి రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని పరిశోధన కేంద్రం త‌గిన‌ ప‌రిష్కారాల‌ను చూపాల‌ని సూచించారు.

అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం 1953 నుంచి.. కొబ్బ‌రి ఉత్పత్తిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డంపై కన్నబాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కొబ్బరి రైతులకు మరింత మేలు చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధన చేయాలని సూచించారు. రాష్ట్రం కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో నాల్గో స్థానంలో, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉందని వివరించారు. కొబ్బరిలో పురుగుల నివారణకు.. కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందులను ఇచ్చే కొత్త పద్ధతి రాష్ట్రంలో తొలుత ఈ పరిశోధనా కేంద్రంలో కనుగొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి, వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.