సీఎం జగన్ వందరోజుల పాలన బాగుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కితాబిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ ఎంతో కృషిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. గురువారం ఏపీలో పర్యటించిన ఆయన... విశాఖపోర్ట్, గంగవరంపోర్టులను సందర్శించారు. ఈ రెండు పోర్టుల నుంచి యూరియా సత్వర రవాణాకు ఏపీ అధికారులు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. యూరియా, ఎరువుల రవాణాకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. యూరియా సత్వర రవాణాకు పోర్ట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన గంగవరం పోర్టు సీఈఓ నండూరి సాంబశివరావుకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్ట్ అధికారులతో తెలంగాణ మంత్రి బృందం సమావేశమైంది. గంగవరం పోర్టులో వియత్నాం నుంచి వచ్చిన యూరియా నౌకను సందర్శించారు.
ఇవీ చూడండి: బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!