Agri Gold customers: ఏలూరు జిల్లా కేంద్రంలో కాశి విశ్వేశ్వర కళ్యాణ మండపంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు పొదుపు చేసుకున్న నగదుతో సీఎం వేల కోట్ల ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వస్తే.. ప్రతి నెల రూ.250 కోట్లు చెల్లిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పరన్నారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులను నట్టేట ముంచడంతో.. వారంతా దిగులుతో కుమిలిపోతున్నారన్నారు.
సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని 10 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకు రూ.3040 కోట్లు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీన వేలాది మందితో విజయవాడలో శాంతియుతంగా అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రందన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రదర్శనకు అగ్రిగోల్డ్ బాధితులు, సానుభూతిపరులు హాజరై విజయవంతం చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: