ETV Bharat / city

'జగన్‌, కల్లంలపై ధిక్కరణ విచారణ.. కోర్టే సుమోటోగా చేపట్టొచ్చు' - ఏజీకి అశ్వినీకుమార్‌ లేఖ

సీఎం జగన్‌పై కోర్టు ధిక్కరణ అంశంలో.. న్యాయవాది అశ్వినీకుమార్‌ లేఖపై ఏజీ కె.కె.వేణుగోపాల్‌ మరోసారి స్పందించారు. ఈ అంశం సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేనంటూ పునరుద్ఘాటించారు.సీఎం జగన్‌, కల్లంలపై ధిక్కరణ విచారణ.. కోర్టే సుమోటోగా చేపట్టొచ్చు అన్నారు. లేదంటే వారు అందుకోసం అభ్యర్తించొచ్చు అని తెలిపారు.

ag-venugopal-responding-to-lawyer-ashwinikumar-letter
సీఎం జగన్‌పై కోర్టు ధిక్కరణ అంశం
author img

By

Published : Nov 8, 2020, 1:57 PM IST

Updated : Nov 9, 2020, 7:06 AM IST

సీఎం జగన్‌పై కోర్టు ధిక్కరణ అంశం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంలపై కోర్టు ధిక్కరణ నేరం కింద విచారణ చేపట్టడానికి తాను అనుమతి ఇవ్వలేకపోయినప్పటికీ, ఆ అంశాన్ని న్యాయస్థానమే సుమోటోగా తీసుకోవచ్చని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. లేదంటే వారిపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని నేరుగా కోర్టును అభ్యర్థించవచ్చని భాజపా నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయకు సూచించారు. అందుకు తన అనుమతి లేదా తిరస్కార నిర్ణయం అడ్డంకి కాదని పేర్కొంటూ మరోసారి జవాబిచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ గత నెల 6న ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ లేఖ రాయడం, ఆ తర్వాత అజేయ కల్లం దానిని మీడియా ద్వారా బహిర్గతం చేయడం కోర్టు ధిక్కరణ నేరం కిందికి వస్తుంది కాబట్టి వారిపై ఆ చట్టం కింద కేసు దాఖలు చేయడానికి అనుమతించాలంటూ అశ్వినీ కుమార్‌ అక్టోబరు 25న అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. ఆ అంశం ప్రాథమికంగా కోర్టు ధిక్కార ధోరణి కిందకే వస్తుందని, అయితే అప్పటికే అది ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున తాను ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ మొదలుపెట్టడానికి అనుమతివ్వలేనని ఈ నెల 2న అటార్నీ జనరల్‌ బదులిచ్చారు. ఈ విషయంలో నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వేణుగోపాల్‌ను అశ్వినీకుమార్‌ మళ్లీ కోరారు. అందుకు స్పందనగా ఆయన శనివారం మరో లేఖ రాశారు.

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అజేయ కల్లంపై కోర్టు ధిక్కరణ నేరం కింద విచారణ ప్రక్రియ చేపట్టడానికి నిరాకరిస్తూ నేను తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మీరు రాసిన లేఖ అందింది. పునఃపరిశీలన కోసం మీరు చూపిన కారణాలను జాగ్రత్తగా పరిశీలించా. ఈ నెల 2న మీకు రాసిన లేఖలో నేను చెప్పినట్లుగా ఆరోపిత కోర్టు ధిక్కార వ్యాఖ్యలు ప్రధాన న్యాయమూర్తికి నేరుగా రాసిన లేఖలో ఉన్నాయి. ఆ లేఖను విడుదల చేసిన విలేకరుల సమావేశాన్నీ నేను చూశా. అందులో ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోని అంశాలు మినహా అదనంగా ఏమీ చెప్పలేదు. మీడియాకు విడుదల చేసిన లేఖ, మీరు నా అనుమతి కోసం తొలుత పంపిన విజ్ఞప్తితో జత చేసిన అంశాలు కోర్టు ధిక్కరణకు సంబంధించిన విషయాలే. జగన్‌ రాసిన లేఖలో ఎక్కడా కాన్ఫిడెన్షియల్‌ అని మార్క్‌ చేయలేదు. దానిని విలేకరుల సమావేశం పెట్టి బహిర్గతం చేశారు. ఆ అంశాలపై ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా వార్తలొచ్చాయి.

అందువల్ల ఆ లేఖను ప్రైవేటు లేఖగా అభివర్ణించడానికి వీల్లేదు. ఈ విషయాలన్నీ ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నాయి. అందువల్ల నా అభిప్రాయాన్ని మార్చుకోవడానికి కారణాలు కనిపించడం లేదు. సీజేకి జగన్‌ రాసిన లేఖలోని అంశాల్లోనే కోర్టు ధిక్కరణ ధోరణి ఉందన్నదే ఇక్కడి ఆరోపణల్లోని ముఖ్యాంశం. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్న అంశానికి అనుమతిచ్చి, దీనిపై ఆయన నిర్ణయం తీసుకోకుండా అవరోధం కల్పించడం నాకు భావ్యం కాదు. కోర్టు ధిక్కరణ అన్నది న్యాయస్థానం, ధిక్కారానికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన విషయం. అందువల్ల మరెవరూ దాన్నో హక్కుగా పరిగణించి కోర్టు ధిక్కార ప్రక్రియ చేపట్టాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. ఈ కారణాలతో, నా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలన్న మీ విజ్ఞప్తితో ఏకీభవించడం లేదు. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం సుప్రీంకోర్టే సుమోటోగా ఈ అంశాన్ని కోర్టు ధిక్కరణ కింద తీసుకోవచ్చు. వారిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ నేరం కింద చర్య తీసుకోవాలని అభ్యర్థిస్తూ ఈ వాస్తవాలను మీరు సుప్రీం న్యాయమూర్తులకు నివేదించుకోవచ్చు’ అని వేణుగోపాల్‌ లేఖలో అశ్వినీ కుమార్‌కు సూచించారు.

ఇదీ చదవండి: సీఎం.. సలహాదారుల చర్య కోర్టు ధిక్కరణే..! కానీ..

Last Updated : Nov 9, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.