ETV Bharat / city

ఇకపై రోజూ విచారణ.. అవసరమైతే ప్రత్యక్షంగా..! - ap high court on amaravathi news

రాజధాని బిల్లులపై మంగళవారం నుంచి పూర్తిస్థాయి రోజువారీ విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించిందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతం ఆన్​లైన్​లో కేసుల విచారణ సాగుతుండగా.. అవసరమైతే ప్రత్యక్ష విచారణ జరిపే అవకాశం కూడా ఉందని తెలిపినట్లు పేర్కొన్నారు.

HC_on_Amaravathi_Issue
HC_on_Amaravathi_Issue
author img

By

Published : Oct 5, 2020, 3:52 PM IST

Updated : Oct 5, 2020, 7:45 PM IST

రాజధాని వికేంద్రీకరణ బిల్లులు, సంబంధింత కేసులపై రేపటి నుంచి రోజువారి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అమరావతికి సంబంధించిన 93 కేసులపై హైకోర్టు పూర్తి ధర్మాసనం ఇవాళ విచారించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలపై ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై న్యాయస్థానం ఇప్పటికే స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. అవే ఉత్తర్వులు కొనసాగుతాయని వెల్లడించినట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

ఈ కేసులన్నీ చాలా ముఖ్యమైనవని... రేపటి నుంచి పూర్తి స్థాయి విచారణ జరపాలని కోర్టు నిర్ణయించిందని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుల విచారణ ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది. అయితే కీలక పత్రాలు పరిశీలనచేయాల్సి వచ్చినపుడు ప్రత్యక్ష విచారణ చేపడతామని.. అందుకు ఇరుపక్షాల వారు సిద్ధంగా ఉండాలని ధర్మాసనం చెప్పినట్లు న్యాయవాది వెల్లడించారు. పిటిషన్ నంబర్ల వారీగానే విచారణ జరగనుందని చెప్పారు.

ఇదీ చదవండి:

ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్

Last Updated : Oct 5, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.