ఈనెల 28న చంద్రబాబు అమరావతి పర్యటనలో.. ప్రజల సమక్షంలో వైకాపా భాగోతాలను ఎండగడతారని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని పనులను అటకెక్కించారని మండిపడ్డారు. అమరావతికి గెజిట్ లేదని, మ్యాప్‌లో చోటు లేదని వైకాపా నేతలు రోజుకో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటనలో నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో మంత్రులకు నిద్ర కరవైందని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.
ఇదీ చదవండి