అత్యధిక కరోనా కేసులున్న తమిళనాడు నుంచి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెదేపా నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణ సరిహద్దులో వేలాది మంది ఏపీ వాళ్లు క్వారంటైన్‌కి వెళ్తామంటేనే రానిస్తామన్న జగన్ దీనికేమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కరోనా వ్యాప్తి జరగకుండా ఎన్నికలు వాయిదా వేసిన రమేశ్ కుమార్‌ను తొలగించేందుకు అత్యవసర ఆర్డినెన్స్, సెలవురోజుల్లో రహస్య జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. కరోనా ప్రభావం వృద్ధులపై ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నా కనగరాజ్‌ని తీసుకొచ్చారని ఆక్షేపించారు. ఆయనేమైనా కరోనా కట్టడి చేసే శాస్త్రవేత్తా లేక వైద్యుడా? అని ప్రశ్నించారు. కనీసం బాధ్యతలు స్వీకరించేటప్పుడు మాస్క్ కూడా పెట్టుకోని ఆయన రాష్ట్ర ప్రజల ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: