ETV Bharat / city

వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తేవడమే లక్ష్యం: అచ్చెన్న

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని... కొత్త సారథి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశానికి బీసీలే వెన్నెముకగా ఉన్నారని... వారి మద్దతు మళ్లీ కూడగడతానని చెప్పారు. శ్రేణుల్లో ధైర్యం నింపి... వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళతానని ఉద్ఘాటించారు

ap tdp chief Achennaidu
తెదేపా కొత్త సారథి అచ్చెన్నాయుడు
author img

By

Published : Oct 20, 2020, 7:25 AM IST

''తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి వెనుకబడిన వర్గాలు పార్టీకి వెన్నెముకగా నిలిచారు. గత ఎన్నికలలో వైకాపా మాయమాటలు చెప్పి, వారి మధ్య కొంత విభజన తెచ్చింది. వారందరి మద్దతు మళ్లీ కూడగడతా. వచ్చే ఎన్నికల్లో తెదేపాని అధికారంలోకి తెచ్చి, చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం'' అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, అవినీతిని, దౌర్జన్యాలను ఎండగట్టేందుకు రాష్ట్రమంతా గజ్జెకట్టుకుని తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతానన్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

  • వెనుకబడిన వర్గాలే తెదేపాకి అండాదండా

ఎన్టీఆర్‌ 1982లో పార్టీని స్థాపించినప్పటి నుంచీ తెదేపా అంటే బీసీలు... బీసీలంటే తెదేపా అన్నంతగా బంధం పెనవేసుకుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ... పదవుల కేటాయింపులో వారికి సముచిత ప్రాధాన్యమిచ్చింది. పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్ష పదవుల్లోనూ 60% బీసీలకు ఇచ్చాం. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలోనూ వారికే పెద్దపీట వేశాం. ఈ వర్గాల్లోని కొన్ని కులాలవారు 2019 ఎన్నికల్లో వైకాపా మాయమాటలు నమ్మడంతో.... కొంత విభజన వచ్చింది. దూరమైన కులాలన్నింటినీ మళ్లీ పార్టీకి దగ్గర చేస్తా. పార్టీపరంగా ఏమైనా లోపాలు జరిగుంటే సరిదిద్దుకుంటాం. గత 16 నెలల్లో వైకాపా రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించింది. దేశ, విదేశాల్లో రాష్ట్ర పరువును చెడగొట్టింది. రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం.

  • ఆ 730 మంది వైకాపా కార్యకర్తలతో ఉపయోగం లేదు

మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీలకు అవకాశమిచ్చామని, వివిధ కార్పొరేషన్లలో బీసీలకు 730 పదవులిచ్చామని వైకాపా నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. కానీ... అధికారం లేకుండా, మంత్రివర్గంలో ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం. జనాభాలో 70% బీసీలుంటే... కేవలం 730 మంది వైకాపా కార్యకర్తలకు పదవులిచ్చి, మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లు చెబుతున్నారు.

  • వైకాపా దమనకాండపై పోరాటం

వైకాపా ప్రభుత్వ దమనకాండ, అరాచకాలు, దౌర్జన్యాలు, ఆర్థికంగా దెబ్బకొట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం వంటి చర్యలతో ప్రజలు, తెదేపా కార్యకర్తలు కొంత భయపడి పోరాటంలోకి రావడం లేదు. ప్రజలు, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతా. చంద్రబాబుకి అండగా ఉంటూ, ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నానన్న అక్కసుతోనే... నేను ఎలాంటి తప్పూ చేయకపోయినా కేసులో ఇరికించారు. ఎవరికీ భయపడను. 24 గంటలూ పార్టీ కోసం పనిచేయడమే నా ఉద్యోగం. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటా.

  • తెదేపా ఒక విశ్వవిద్యాలయం

తెదేపా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎందరో నాయకులు వచ్చారు. ఎందరో వెళ్లిపోయారు. కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదు. కొందరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం జరగదు. ఒకరు వెళితే వంద మందిని తయారు చేసే సత్తా మా పార్టీకుంది. తెదేపా ఓ పెద్ద విశ్వవిద్యాలయం.

తెదేపా కొత్త సారథి అచ్చెన్నాయుడు

సమస్యను చక్కదిద్దడంలో మొహమాటపడను

సీనియర్లను, యువతను సమన్వయం చేసుకుంటూ.. పార్టీని ముందుకు తీసుకెళతా. అర్హతలకు అనుగుణంగా పదవులు దక్కేలా చూస్తా. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిన నియోజకవర్గాలకు స్వయంగా వెళ్లి, పరిస్థితి చక్కదిద్దుతా. ఎవరివల్లనైనా పార్టీకి సమస్యలు వస్తున్నా, నష్టం జరుగుతున్నా.... చక్కదిద్దడానికి మొహమాటపడను. పార్టీ అధినేత సూచన మేరకు చర్యలు తీసుకుంటా. పార్టీ రాష్ట్ర కమిటీని అతి త్వరలో ప్రకటిస్తాం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తాం.

  • అచ్చెన్నాయుడు వెన్నంటి సాగుతాం: రామ్మోహన్‌నాయుడు

తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో అచ్చెన్నాయుడు వెన్నంటి సాగుతామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అచ్చెన్నాయుడికి ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘బాబాయ్‌ ఆత్మస్థైర్యం, ఎవరికీ భయపడని గుండెబలం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే మనస్తత్వాన్ని చూస్తూ పెరిగా. నా పనితీరుపై నమ్మకంతో తెదేపా జాతీయ కార్యదర్శిగా నియమించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

  • అశోక్‌బాబు, పట్టాభిరామ్‌లకు అభినందనలు

తెదేపా కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్సీ అశోక్‌బాబు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా పట్టాభిరామ్‌ నియమితులైన సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు వారిని అభినందించారు. మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం, వడ్రాణం హరిబాబు, వల్లూరు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా కమిటీల ప్రకటన... బలహీన వర్గాలకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.