పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విశాఖలో మేయర్ అభ్యర్థి ఎంపిక, కార్పొరేటర్ అభ్యర్థుల పేర్ల ఖరారుపై బుధవారం ఆయన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘విశాఖలో ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉండటంతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యర్థులను భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కొంతమందితో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. అభ్యర్థే వచ్చి ఉపసంహరించుకుంటేనే ఆమోదం తెలపాలి. దీనిపైనా ఈసీకి లేఖ రాశాం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒకటి నుంచి ఏడో తరగతి దాకా సీబీఎస్‌ఈ: సీఎం జగన్