ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద.. వైకాపా జరిపిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. వైకాపా శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రతిపక్షంపై ఇటువంటి దాడులు చేయడం సమర్థనీయం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : TDP Nirasana : తెదేపా నిరసన గళం.. పోలీసు అరెస్టుల పర్వం..