ETV Bharat / city

ఆధార్ కేంద్రాలు తక్కువ.. అవసరాలు ఎక్కువ - Aadhaar updation problems

ఆధార్‌.. అన్నింటికీ ఇదే ఆధారం. పిల్లలకు అమ్మఒడి పథకం డబ్బులు రావాలన్నా, పెద్దలకు ఇళ్ల స్థలాల పట్టాల నుంచి ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా.. చివరకు పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాల్లో చేరాలన్నా కూడా ఆధార్‌ వివరాలు అడుగుతున్నారు. కానీ, ఇందులో ఏ చిన్న మార్పు చేయాలన్నా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. చిరునామా, మొబైల్‌ నంబరు, వేలిముద్రలు.. ఇలా అన్నింటికీ ఎదురుచూపులు తప్పట్లేదు.

Aadhaar problems in AP
ఏపీలో ఆధార్ ఇబ్బందులు
author img

By

Published : Jan 13, 2021, 1:14 PM IST

ఆధార్‌ కేంద్రాల సంఖ్య పెంపు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఆధార్‌ కేంద్రాలు పనిచేయాలనే యూఐడీఏఐ నిర్ణయంతో.. పలుచోట్ల మీ-సేవా కేంద్రాల్లో సేవలూ నిలిచిపోయాయి. దీంతో సమస్య మరింత తీవ్రమైంది. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో కేంద్రాలు నడుస్తున్నా.. ఒక్కో చోట సగటున రోజుకు 50 మందికే సేవలు అందుతుండటంతో నిరీక్షణ తప్పడం లేదు. మీ-సేవా కేంద్రాల్లో వెంటనే సేవలు ప్రారంభించడంతో పాటు.. ప్రతి గ్రామం/వార్డులో సచివాలయాలు ఉన్నందువల్ల అక్కడ ఆధార్‌ నమోదు కేంద్రాలు ప్రారంభిస్తే ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది.

సమస్య తీవ్రం.. ప్రజల పడిగాపులు

గతంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 850 వరకు మీ-సేవా కేంద్రాల్లో ఆధార్‌ సేవలందేవి. ఇటీవల వీటిలో సగం కేంద్రాలకు అనుమతి రద్దుచేశారు. ఆధార్‌ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లోనే ఉండాలని, అధికారి పర్యవేక్షణలో నడవాలని యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. దీంతో బయట మీ-సేవా కేంద్రాల్లో నడిచేవాటిని తహసీల్దారు కార్యాలయాల ఆవరణలోకి మార్చి, విశ్రాంత అధికారుల ఆధ్వర్యంలో నడపాలని సూచించారు. దీనికి కొందరు అంగీకరించలేదు. మరికొందరు సమ్మతించినా.. ఇంకా అనుమతి లభించక సేవలు నిలిచాయి.
* లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సేవలు నిలిచాయి. వీరంతా ఇప్పుడు కేంద్రాలకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు తెరుస్తుండటంతో విద్యార్థులకు వేలిముద్రల మార్పిడి అవసరమైంది. వీటికోసం తెల్లవారుజామునే వచ్చి లైనులో నిలబడి టోకెన్‌ తీసుకుంటేనే.. ఆధార్‌ సరిదిద్దుకునే అవకాశం లభిస్తోంది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకుంటే.. ఎప్పుడు వెళ్లాలో తెలుస్తుంది. కానీ కొన్నిచోట్ల టోకెన్లు, స్లాట్లతో సంబంధం లేకుండా డబ్బులు తీసుకుని వెంటనే సరిచేసి పంపిస్తున్నారు.

సుప్రీం ఉత్తర్వులున్నా..

రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలతో పాటు.. పుట్టిన తేదీకీ ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటోంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇలా తీసుకోవడం విరుద్ధమని కొందరు అధికారులకు చెబుతున్నా ప్రభుత్వ నిర్ణయం అలాగే ఉందని అంటున్నారు. పురపాలక సంఘం, పంచాయతీ కార్యాలయాలు ఇచ్చే ధ్రువీకరణలను తీసుకోవాలి. నివాస ధ్రువీకరణకు కూడా గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చే పత్రం సరిపోతుంది. అయినా అన్నిటికీ ఆధార్‌ అనడంతో సమస్యలు ఎక్కువవుతున్నాయి.

ఎక్కువగా వేటి కోసమంటే?

వివిధ పథకాలకు అర్హత కోసం ఆధార్‌ వివరాలు తీసుకుంటున్నారు. ఆధార్‌ నమోదు సమయంలో హడావుడిగా ఏదో ఒకటి రాసేశారు. అలాంటి వారికి నవీకరణ తప్పనిసరి అవుతోంది. కొత్తగా పెళ్లి చేసుకున్నా, భార్యకు బెంగళూరులో ఆధార్‌ ఉండటంతో ఇక్కడకు మార్పించుకోవాల్సి వస్తోందని విజయవాడకు చెందిన శివ వివరించారు. పిల్లలకు వేలిముద్రలు వేయించడానికి కేంద్రానికి వచ్చామని సుశీల వివరించారు.
* ఆధార్‌లో మొబైల్‌ నంబరు నమోదు, మార్పిడి
* వేలిముద్రలు (వృద్ధులకు వేలిముద్రలు సరిగా పడకపోవడం)
* చిరునామా మార్పు (స్థానికంగానే ఉండాలనే నిబంధనలతో)
* 15 ఏళ్లు దాటిన విద్యార్థులకు వేలిముద్రల దిద్దుబాటు
* చిన్న పిల్లలకు కొత్తగా నమోదు

85% మంది నవీకరణ కోసమే

ఆధార్‌ కేంద్రాల్లో కొత్త కార్డులు తీసుకునేవారు 15% అయితే.. వివరాల నవీకరణకు 85% మంది వస్తున్నారు. విశాఖపట్నంలోని బుచ్చయ్యపేట తహసీల్దారు కార్యాలయంలో కొత్త కార్డుల కోసం నమోదు చేసుకున్నవారు 220 మంది, సరిదిద్దుకున్న వారు 1,414 మంది ఉన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్లా ఇలాగే ఉంటోంది.

పట్టించుకోని యూఐడీఏఐ

ఆధార్‌ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. యూఐడీఏఐ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం ఉన్నా.. తూతూమంత్రంగా పర్యవేక్షిస్తున్నారు. సమస్యలతో ఎవరైనా ఫోన్‌ చేసినా సమాధానం చెప్పే దిక్కు లేదు.

ఇదీ చదవండి:

టీకా వేయాలంటే... ఓటీపీ ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.