ETV Bharat / city

తెలంగాణ: లారీ చక్రాల మధ్య ఇరుకున్న యువకుడు - A young man stuck in the middle of the lorry wheels

ప్రమాదవశాత్తు లారీ చక్రాల మధ్యలో ఓ యువకుడు ఇరుక్కుపోయాడు. దాదాపు 45 నిమిషాలు స్థానికులు శ్రమించిన అనంతరం అతను సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. తెలంగాణలోని నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

a-young-man-stuck-in-the-middle-of-the-lorry-wheels-in-nagarkurnool
తెలంగాణ : లారీ చక్రాల మధ్య ఇరుకున్న యువకుడు
author img

By

Published : Jun 4, 2021, 9:43 PM IST

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. లారీ కింద ఇరుక్కుపోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను సురక్షితంగా బయటపడటానికి సుమారుగా 45 నిమిషాల సమయం పట్టింది. జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చౌరస్తా ప్రధాన రహదారిపై లారీ.. రివర్స్ గేర్‌లో కిరాణా షాపులకు వస్తువులు డంపు చేస్తోంది. ఆ సమయంలో స్థానికంగా నివసించే మైబుస్‌ లారీ వెనుక వైపు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు టైర్ కింద పడిపోయాడు. వెంటనే డ్రైవర్ బ్రేక్ వేసినా.. అప్పటికే మైబుసు కాలు టైర్ మధ్యభాగంలో ఇరుక్కుపోవడంతో బాధితుతడు ఆర్తనాదాలు చేశాడు.

డ్రైవర్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక దశలో జేసీబీతో యత్నించినా కాపాడలేకపోయారు. చివరికి స్థానికులు చాకచక్యంగా బాధితుడిని రక్షించగలిగారు. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: corona effect: కర్ఫ్యూ ఆంక్షల వల్ల నష్టాల్లో ఆక్వా రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.