రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నివసించే ఓ వ్యక్తి ఇటీవల తన ఇంటికి తాళం వేసి పనిమీద కూకట్‌పల్లికి వెళ్లారు. ఆయన తన ఇంటి ఆవరణలో సీసీకెమెరాలు ఏర్పాటుచేసుకున్నారు. ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న రూ.3 వేల విలువైన చిన్న కెమెరాను హాల్లో ఉంచారు. ఇంట్లోకి ఓ దొంగ చొరబడి సీసీకెమెరాలు, వాటి డీవీఆర్‌తోపాటు ఇంట్లోని చిన్న కెమెరాను, సొత్తును ఎత్తుకెళ్లాడు. యజమాని చిన్న కెమెరాకు వైఫైని అనుసంధానించి తన చరవాణిలో నిత్యం దృశ్యాలు కనిపించేలా చూసుకున్నారు.
కూకట్‌పల్లిలో ఉన్నపుడు ఆయన తన ఫోన్‌లో చూసుకోగా చిన్న కెమెరా ఫుటేజ్ కట్ అయినట్లు గ్రహించారు. అనుమానంతో వెంటనే తన ఇంటి¨ సమీపంలో ఉండే సోదరుడిని వెళ్లి చూడమన్నారు. తాళాలు పగులగొట్టి ఉండడం, బీరువాలో వస్తువులు కిందపడి ఉండడం ఆయన గమనించారు. యజమాని తన చరవాణిలో అప్పటివరకు రికార్డయిన చిన్న కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా దొంగ ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా చోరుడిని పోలీసులు 24 గంటల్లోనే పట్టుకుని కటకటాలపాలు చేశారు.
ఇవీ చదవండి: