రైతుల పాదయాత్రలో ఓ పోలీస్ అధికారి ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యపరచింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలు, రైతులను గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సమయంలో ఓ పోలీస్ అధికారి ఇటుకను పట్టుకుని ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. లాఠీ పట్టుకోవాల్సిన సమయంలో రాయి తీసుకోవటంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇటుకను కొంత దూరం పట్టుకెళ్లిన తరువాత జనాన్ని, మీడియాను చూసి ఆయన ఇటుకను వదిలేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఇదీ చదవండి: