ఇదీ చదవండి:
మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు వార్తలు
మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన వ్యక్తి.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మనస్తాపానికి గురై... ఇంటికి వెళ్లగానే వ్యాస్మాల్ తాగాడు. వెంటనే అతన్ని రాయచోటిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.
మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసులోని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ కేసులో విచారణకు పిలిచి తనను వేధించారంటూ కడప జిల్లా దేవళంపేటకు చెందిన కిరణ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మంత్రి వనిత సంతకం ఫోర్జరీ చేసిన కేసులో అనుమానితుడిగా ఉన్న తెదేపా నేత రెడ్డప్ప ఆచూకీ లభించకపోవడం వల్ల అతని బంధువులు, అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కింద కిరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రాత్రంతా స్టేషన్‌లో ఉంచి విచారణ జరిపారు. మనస్తాపానికి గురైన కిరణ్... ఇంటికి వెళ్లగానే వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తాము విచారణకు తీసుకెళ్లిన మాట వాస్తవమే కానీ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: