App for complaint on power issues: తెలంగాణలో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారులకు నూతన యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సీ.జీ.ఆర్.ఎఫ్(CGRF) పేరిట రూపొందించిన ఈ యాప్‌ను ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ శ్రీరంగారావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డిలు సోమవారం మండలి కార్యాలయంలో సంయుక్తంగా ఆవిష్కరించారు. విద్యుత్ సమస్యలు, నాణ్యత, అధికారుల పనితీరుపై వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో అంబుడ్స్‌మెన్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని శ్రీరంగారావు తెలిపారు.
ఇదీ చదవండి: Dharmana Krishnadas: 'జగన్ మళ్లీ సీఎం కాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటాం'