చేతిలో ఆస్పత్రికి సంబంధించిన ఫైళ్లను చూపిస్తున్న కన్నాల సుజాత - వెంకట్ దంపతులది అన్యోన్య దాంపత్యం. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన కన్నాల వెంకట్ కు.. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన సుజాతతో 2001లో వివాహమైంది. ఆ తర్వాత ఏడాదికి కుమారుడు జన్మించగా 2012 లో వెంకట్‌కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.
చెడిపోయిన మూత్రపిండాలు
అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో 2013లో వెంకట్ తీవ్ర అనారోగ్యానికి గురి కాగా... రెండు మూత్రపిండాలు చెడిపోయినట్లు తేలింది. అంతే.. సుజాత జీవితంలో అంధకారం అలుముకుంది. వెంకట్ తల్లితండ్రులతోపాటు భార్య సుజాత కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ మ్యాచ్ అవలేదు. ఇక బతకడం కష్టమనే భావన వైద్యుల నుంచి వినిపించింది.
కిడ్నీదానం
కూతురు మాంగళ్యానికి కష్టం వచ్చిందనే విషయం ఆమె తల్లి లక్ష్మికి తెలిసింది. అంతే.. వెనకాముందు ఆలోచించకుండా మూత్రపిండాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనుకున్నట్లుగానే 2014 ఫిబ్రవరి ఏడో తేదీన వెంకట్‌కు మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స చేశారు. తనకు ప్రాణం పోసిన అత్తమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనని వెంకట్ అన్నారు. మరోపక్క లక్ష్మిలో మాత్రం.. తాను అల్లుడి ప్రాణం నిలబెట్టాననే భావన, ఉద్దేశం ఏ కోశానా కనిపించడం లేదు. తన కూతురు మాంగళ్య జీవితానికి తాను కాస్తంత ఆసరాగా నిలిచాననే ఆనందమే తొణికిసలాడుతోంది ఆ త్యాగశీలిలో. పైగా తాను చేసింది అసలు సాయమే కాదని మాతృత్వపు మమకారాన్ని చూపుతోంది లక్ష్మి.
ఇదీ చదవండి: